నిత్య పెళ్లి కొడుకు అరెస్టు

27 Jul, 2019 09:25 IST|Sakshi
నిందితుడు సోహెల్‌

ఇద్దరు భార్యలను వదిలేసి ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైన వైనం

తార్నాక: మేనమామ కుమార్తెను వివాహమాడి ఆరునెలలకే వదిలేశాడు, కొద్దికాలానికే మరో యువతిని పెళ్లిచేసుకుని వారం రోజులకే వదిలేశాడు. ముచ్చటగా మూడోపెళ్లికి సిద్దమైన ఓ యువకుడు పోలీసులకు దొరికిపోయిన సంఘటన ఓయూ పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఓయూ ఎస్‌ఐ నర్సింగరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌జిల్లా,  రాంపల్లికి చెందిన మహ్మద్‌ సోహేల్‌(24) ప్రైవేటు ఉద్యోగి. 2016లో అతను తన మేనమామ కుమార్తెను వివాహం చేసుకుని ఆరు నెలలకే వదిలేశాడు. అనంతరం పీర్జాదిగూడకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్న అతను కేవలం వారం రోజులు మాత్రమే కాపురం చేసి వదిలేశాడు. నెల రోజుల క్రితం లాలాపేటలో ఓ యువతిని చూసిన అతను  ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదుర్చుకున్నాడు. ఈనెల 23న ఆమెతో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకోవడమేగాక వధువు తండ్రి నుంచి రూ.50వేలు కట్నంగా తీసుకున్నాడు. అయితే సదరు యువతి కుటుంబ సభ్యులు సోహెల్‌ గురించి వాకబుచేయగా, అతడికి ఇçప్పటికే రెండుపెళ్లిళ్లు జరిగినట్లు స్థానికులు చెప్పడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన  బాధితులు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టుచేసి  రిమాండ్‌కు తరలించినట్లు  ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెన్స్‌పార్లర్‌లో గొడవ

పరామర్శకు వెళ్లి మృత్యు ఒడికి.. 

నింద శరాఘాతమై.. మనసు వికలమై..

మూ​కహత్య : మరో దారుణం

మైనర్‌ బాలిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

తల్లి పేరున ఇన్సూరెన్స్‌ కట్టి హత్య...

ఆరూష్‌ ఎక్కడ?

ఒక భర్త... నలుగురు భార్యలు

హైకోర్టులో కోడెల కుమార్తెకు చుక్కెదురు

పిన్నికి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి..

దొంగను పట్టించిన 'చెప్పు'

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

లాటరీ పేరిట రూ.70 లక్షల మోసం

ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

యువతి కిడ్నాప్‌; కీలక ఆధారాలు లభ్యం..!

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించాడు

తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్‌

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

వేర్వేరు చోట్ల.. వ్యక్తుల అదృశ్యం

వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..

రెచ్చగొట్టే పాట : సింగర్‌ అరెస్టు

రౌడీషీటర్‌ కారసాని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు!

కట్టుకున్నోళ్లే కడతేర్చారు

స్మగ్లింగ్‌ స్పెషలిస్ట్‌

దళిత సేవలో నాలుగో సింహం

ఎస్‌ఐ బైక్‌నే కొట్టేశార్రా బాబూ!

మాటల్లో దించి కారులో..

యువతి వేధిస్తోందని...

బెదిరించడం.. దోచుకెళ్లడం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌