వ్యక్తి మృతదేహం గుర్తింపు

7 Jun, 2019 13:27 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు

నెల్లూరు ,నాయుడుపేట: మండల పరిధిలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న వంతెన కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం మున్సిపల్‌ సిబ్బంది గుర్తించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్వర్ణముఖి నదిలో వంతెన వద్ద తాగునీటి మోటార్‌ మరమ్మతులకు గురై ఉండడంతో మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తన సిబ్బందితో గురువారం అక్కడికి వెళ్లారు. ఈక్రమంలో వ్యక్తి మృతదేహాన్ని చూసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వేణు, హెడ్‌కానిస్టేబుల్‌ తిరుపతిరావులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల గాలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేవాడని పోలీసులు గుర్తించారు. ఎండవేడిమికి తట్టుకోలేక మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. వీఆర్వో నాగార్జునరెడ్డి సమక్షంలో శవ పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు