కిడ్నాప్‌ చేసి గుండు గీయించారు

24 Apr, 2019 07:37 IST|Sakshi

సెల్‌ఫోన్, నగదు లాక్కుని దాడి

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు  

బంజారాహిల్స్‌: మాట్లాడదామని అర్థరాత్రి పిలిచి కిడ్నాప్‌ చేసి కారులో పాతబస్తీలో తిప్పుతూ ఓ సెలూన్‌లో బలవంతంగా గుండు గీయించడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫస్ట్‌లాన్సర్‌ సమీపంలోని అహ్మద్‌ నగర్‌కు చెందిన మన్సూర్‌అలీ ఖాన్‌ అలియాస్‌ నాసర్‌(19) విద్యార్థి. సోమవారం అర్థరాత్రి అతడికి ఫోన్‌ చేసిన ఓ యువకుడు తనను హయత్‌గా పరిచయం చేసుకుని మాట్లాడేది ఉందంటూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లోని జీవీకే వన్‌ చౌరస్తాకు పిలిపించాడు.

అర్థరాత్రి అక్కడికి వచ్చిన మన్సూర్‌ను ఇబ్రహీం ఖాన్‌తో పాటు మరో ఇద్దరు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకొని అసభ్యంగా దూషిస్తూ సైదాబాద్‌కాలనీ అక్బర్‌బాగ్‌లో తిప్పారు. సైదాబాద్‌ కాలనీలోని ఓ సెలూన్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి అతడికి గుండుకొట్టించారు. సెల్‌ఫోన్, జేబులో ఉన్న రూ.5 వేల నగదు లాక్కుని తీవ్రంగా కొట్టారు. అనంతరం మళ్లీ కారులో ఎక్కించుకొని ఆరంఘర్‌ చౌరస్తాకు తీసుకెళ్లారు. ఉదయం 7.45 గంటల  ఈ దృశ్యాలను వీ డియో తీయడేగాక ఇంకోసారి నీ ఇంటికి వచ్చి చ ంపేస్తామంటూ బెదిరించారు. వీడియోను సో షల్‌మీడియాలో పెడతామని హెచ్చరించారు. తీవ్రంగా గాయపడిన అతడిని గుర్తించిన సా ్థనికులు ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై  కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఓ అమ్మాయి విషయం మాట్లాడదామని తనను పిలిపించి కిడ్నాప్‌ చేశారని, బలవ ంతంగా తలవెంట్రుకలు కట్‌ చేయించి తీవ్రంగా కొట్టడమే కాకుండా సెల్‌ఫోన్‌తో పాటు నగదు లా క్కున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫి ర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు