వాట్సాప్‌ వదంతులు: దివ్యాంగురాలిని కొట్టి చంపారు!

23 Jul, 2018 13:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మధ్య ప్రదేశ్‌లో మరో మూక దాడి

భోపాల్‌ : సుప్రీం కోర్టు ఎన్ని హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా మూక హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కర్ణాటకలోని బీదర్‌లో నలుగురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా పొరబడి స్థానికులు చేసిన దాడిలో ఒకరు మృతిచెందిన ఘటన మరవక ముందే మధ్యప్రదేశ్‌లో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పిల్లల కిడ్నాపర్‌ అంటూ ఓ మానసిక దివ్యాంగురాలని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన సింగ్రాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మోర్వా ప్రాంతంలో చోటుచేసుకుంది. 

నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం ఉన్నట్లు ఆదివారం పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరిన పోలీసులు మానసిక స్థితి సరిగ్గా లేని మహిళ మృత దేహంగా గుర్తించారు. ఆమె గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఎవరో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పిల్లల కిడ్నాపర్లు తిరుగుతున్నారనే వాట్సాప్‌ వదంతులతోనే ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు ఆరుగురు నిందితులను గుర్తించారు. ఇదే తరహాలో అటవీ అధికారుపై దాడిచేసిన మరో ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రాజస్తాన్‌లో ఆవుల స్మగ్లింగ్‌కు చేస్తున్నారని ఒకరిని కొట్టి చంపిన విషయం తెలిసిందే.

చదవండి : వెంటాడి...వేటాడారు!

మూక హత్య కేసులో మరో ట్విస్ట్‌

మరిన్ని వార్తలు