విద్యార్థినులకు వైస్‌ ప్రిన్సిపల్‌ అసభ్యకర మెసెజ్‌లు

7 Mar, 2020 11:59 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నల్గొండ: మహత్మగాంధీ యూనివర్శిటీ.. దేవాలయంలాంటి ఈ విద్యాలయంలో బాధ్యతగా పర్యవేక్షణ చేయాల్సిన కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌.. స్థాయి మరచి ఇంజనీరింగ్‌ విద్యార్థినులకు ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెట్టాడు. అతగాడి వేధింపులు భరించలేని విద్యార్థినులు ఎస్పీకి ఫిర్యాధు చేయడంతో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ కాలేజీ వైఎస్‌ ప్రిన్సిపల్‌ వై. పునీత్‌కుమార్‌..  విద్యార్థినులకు ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని మూడు రోజుల క్రితం బాధిత విద్యార్థినులు ఈ విషయాన్ని యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకేళ్లారు. దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సదరు వైస్‌ ప్రిన్సిపాల్‌ మళ్లీ విద్యార్థినులకు అసభ్యకర మెసెజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. దీంతో భరించలేక విద్యార్థులు స్థానిక ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో బాధితు విద్యార్థినులు  వైస్‌ ప్రిన్సిపల్‌ను విచారణ జరిపి విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.

ఫోన్‌డేటా, మెసెజ్‌ల పరిశీలన
విద్యార్థినుల ఫిర్యాధు మేరకు ఎస్పీ రంగనాథ్‌ ప్రత్యేక నిఘా పెట్టారు. ఫోన్‌డేటా, అతను పంపిన మెసెజ్‌లను పరిశీలించడంతో రుజువైంది. ఇక అప్పటికే  నిందితుడు పరారీ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందంతో రెండు రోజుల క్రితం  అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

కవలలపై కీచక తండ్రి, మేనమామ అఘాయిత్యం

కమిటీ ఏర్పాటు
ఇంజనీరింగ్‌ వైఎస్‌ ప్రిన్సిపాల్‌ పునీత్‌ కుమార్‌ విద్యార్థినులను వేధిస్తున్న విషయమై యూనివర్శిటీలో ఓ కమిటీని నియమించినట్లు ఏస్పీ రంగానాథ్‌ తెలిపారు. కమిటీ సభ్యుల విచారణలో తనకు అనుకూలంగా చెప్పాలని పలువురు విద్యార్థులకు ఫోన్‌ చేయడంతో పాటు మెసెజ్‌లు పంపినట్లు కమిటీ వెల్లడించింది. దీంతో కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని యూనివర్శిటీ యాజమాన్యం చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విషయమై యూనివర్శిటీ రిజీస్టార్‌ యాదగిరిని ఫోన్‌లో విచారణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందిచలేదని ఆయన పేర్కొన్నారు. 

గతంలోనూ ఓ అధ్యాపకుడికి దేహశుద్ధి
యూనివర్శిటీలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, గతంలో కూడా ఓ అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సదరు కీచక అధ్యాపకుడికి దేహశుద్ధి చేసినట్లు వెల్లడించారు. పిల్లల బంగారు భవిష్యత్తుపై కలలు కంటున్న తల్లిదండ్రులు ఉన్నత విద్య కోసం యూనివర్శిటీలకు పంపిస్తే.. మార్గనిర్దేశం చేయాల్సిన అధ్యాపకులు అనుసరిస్తున్న తీరు బాధాకరమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సదరు నిందితుడు కీచక వైస్‌ ప్రిన్సిపల్‌ను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు