పట్టపగలు యువకుడి దారుణ హత్య

6 Apr, 2018 08:29 IST|Sakshi
సతీష్‌గౌడ్‌ మృతదేహం ,సతీష్‌గౌడ్‌ (ఫైల్‌)

అంబర్‌పేట:    పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం అంబర్‌పేట పోలీస్‌ష్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించింది. ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్నాక తిరుమలనగర్‌కు చెందిన సతీష్‌గౌడ్‌(27) పెయింటింగ్‌ పనులతో పాటు ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య హిమబిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం సతీష్‌ గౌడ్‌ భార్యతో కలిసి బైక్‌పై దిల్‌శుక్‌నగర్‌ వెళుతుండగా బైక్‌ను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు సతీష్‌గౌడ్‌ను బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. దీంతో హిమబింధులు బంధువులకు సమాచారం అందించింది. 

చంపి రోడ్డుపై పడేశారు..
గోల్నాక కొత్తబ్రిడ్జి అమ్మవారి ఆలయం వద్ద యువకుని మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందడంతో అంబర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సహకారంతో మృతుడిని సతీష్‌గౌడ్‌గా గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా సతీష్‌గౌడ్‌ను హత్య చేసిన వ్యక్తులు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు