రాత్రిపూట చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు

2 Apr, 2018 07:05 IST|Sakshi
నిందితులను అరెస్ట్‌ చేసి మీడియాకు చూపుతున్న డీసీపీ–2 షేక్‌ నవాబ్‌ జాన్, ఈస్ట్‌ ఏసీపీ రామకృష్ణ

రూ.6.5 లక్షల సొత్తు స్వాధీనం

విజయవాడ : రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడే ముఠాను సీసీఎస్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశా రు. వారి నుంచి రూ.6.5 లక్షల విలువ చేసే బంగా రం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో లా అండ్‌ ఆర్డర్‌ ఏడీసీపీ షేక్‌ నవాబ్‌ జాన్‌ వివరాలు వెల్లడిం చారు. సీసీఎస్‌ పోలీసులకు అందిన సమాచారం మేరకు నలుగురు పాత నేర స్తులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన పాత నేరస్తులు తిల్లరి దుర్గారావు అలియాస్‌ పిచ్చి దుర్గారావు, షేక్‌ నాగూర్, దేవరకొండ దుర్గారావు అలియాస్‌ అఘోర, దేవరకొండ గోపి అలియాస్‌ పిట్ల.. చెడు అలవాట్లకు గురై అనేక దొంగతనాలు చేసి జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలై తిరిగి వారు దొంగతనాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులు తాజాగా నున్న ఏరియాలో 7, అజిత్‌సింగ్‌నగర్‌ పరిధిలో 5, భవానీ పురం పరిధిలో 1.. మొత్తం 13 నేరాలకు పాల్పడినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. వీరి నుంచి రూ. 6.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీసీఎస్‌ ఏసీపీ వర్మ, లా అండ్‌ ఆర్డర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు