శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా.. 

26 May, 2020 13:27 IST|Sakshi

శ్రీకాకుళం : జిల్లాలోని మందస సమీపంలో మంగళవారం వలస కూలీలతో వెళ్తున బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 33 మంది గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. కర్ణాటకలో క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న వీరు.. బెంగళూరు నుంచి కోల్‌కతాకు ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు. అయితే బస్సు మందస సమీపంలోకి చేరుకోగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. 

ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 42 మంది వలస కూలీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా