మంత్రికి బెదిరింపు కాల్‌..ఎఫ్‌ఐఆర్‌ నమోదు

30 Aug, 2019 20:37 IST|Sakshi
ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి నంద గోపాల్‌ గుప్తా నంది

అలహాబాద్‌ : ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి నంద గోపాల్‌ గుప్తా నందికి శుక్రవారం బెదిరింపు కాల్‌ వచ్చింది. తాను సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే విజయ్‌ మిశ్రా అనుచరుడిని అని చెప్పుకుంటూ మంత్రిని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి మంత్రి మొబైల్‌కు కాల్‌ చేసి బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు తెలపడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్‌ చేసిన వ్యక్తి అడ్రస్‌ తెలుసుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. అప్పటికే అతను పరారీలో ఉన్నాడు.

కాల్‌ చేసిన వ్యక్తి ఆటో మొబైల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు రాజత్‌ కేశర్వాణిగా గుర్తించారు. నంద గోపాల్‌ గుప్తా పూర్వం బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీలో ఉండి మాయావతి ప్రభుత్వంలో 2007 నుంచి 2012 వరకు మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2015 సంవత్సరంలో నందగోపాల్‌ గుప్తాపై బాంబు దాడి జరిగింది. ఆ సమయంలో గుప్తా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన భార్య ప్రస్తుతం అలహాబాద్‌ మేయర్‌.

మరిన్ని వార్తలు