తండ్రి వివాహేతర సంబంధం.. కుమార్తె ఆత్మహత్య

27 Aug, 2019 12:37 IST|Sakshi
బాలిక మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ రంగనాథ్‌

ఉరేసుకుని కుమార్తె ఆత్మహత్య

ప్రకాశం ,పర్చూరు: మద్యానికి బానిసైన తండ్రి ఎంత చెప్పినా మారక పోవడంతో తీవ్ర మనస్తాపం చెంది మైనర్టీ తీరని కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నూతలపాడులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రంగనాథ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మైనర్‌ కుంచాల పౌలేశ్వరి (15) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పౌలేశ్వరి రెండు రోజుల క్రితం తన తండ్రి కుంచాల సుబ్బారావుతో మాట్లాడింది. ఇక నుంచి మద్యం తాగొద్దని, తనకు పెళ్లి ఈడు వస్తోందని, తనను పట్టించుకోవాలని కోరింది. అయినా సుబ్బారావు మద్యం తాగి ఇంటికి రావడంతో మనస్తాపానికి గురైన బాలిక తాను ఉంటున్న తాత, నాయనమ్మల ఇంట్లోని దులానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సుబ్బారావు దంపతులు 14 ఏళ్ల నుంచి వేర్వేరుగా ఉంటున్నారు.

వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పౌలేశ్వరి తండ్రి వద్ద ఉంటోంది. చిన్న కుమార్తె తల్లి పాపమ్మ వద్ద దుద్దుకూరులోని ఆమె పుట్టింట్లో ఉంటోంది. తండ్రి బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుబ్బారావు మద్యానికి బానిస కావడంతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కుమార్తె పలుమార్లు మానుకోమని హెచ్చరించినా మారలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెంది పెద్ద కుమార్తె పౌలేశ్వరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగనాథ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ

రమేష్‌ హత్య వెనుక రహస్యాలనేకం..!

మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని.. ఖమ్మంలో ఘాతుకం

బైక్‌ మోజులో పడి.. మేనత్తకే కన్నం

గంటలో మూడు ఫోన్లు చోరీ

బడా బిజినెస్‌మెన్‌ అంటూ వలేస్తాడు

‘పార్శిల్స్‌’ కేసులో నిందితుడి అరెస్టు

పేషెంట్‌ బ్యాగు తీసి పక్కన పెట్టినందుకు..

చీటింగ్‌ కేసులో తల్లీకొడుకు అరెస్ట్‌

జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ

ఎట్టకేలకు మోసగాళ్ల అరెస్ట్‌ 

వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!

మూడేళ్ల బాలుడిపై లైంగిక దాడి

కాటేసిన కాలువ

చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

లవ్‌ ఆర్ట్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌.. డేటింగ్‌ ఆఫర్స్‌

శిశువును ఒడిలో దాచుకుని బాలింత ప్రాణత్యాగం

ప్రేమ పేరుతో ఒకడు.. దాని ఆసరాగా మరొకడు..!

తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!

వాస్తు పూజల పేరిట మోసం

అసభ్యకరంగా మాట్లాడాడని..

పోర్టులో మరో ప్రమాదం

కుటుంబాలు చితికిపోతున్నాయ్‌!

93 నిమిషాలకో ప్రాణం!

కోల్‌కతాలో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్

చిదంబరానికి మరో ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు