అక్క భర్తతో చనువు.. గర్భవతిగా మారి చివరకు..!

19 May, 2020 19:32 IST|Sakshi

అబార్షన్‌ వికటించి మైనర్‌ మృతి

మోసగించిన సొంత బావ

సాక్షి, శ్రీకాకుళం: అవాంఛిత గర్భం, ఆదరాబాదరాగా అబార్షన్, నొప్పితో కూడిన చావు.. 17 ఏళ్లకే ఓ అమ్మాయికి ఎదురైన అనుభవాలివి. అక్క భర్తతో పెరిగిన చనువు ఆమెను మృత్యువు వరకు తీసుకెళ్లింది. బావ చేతిలో మోసపోయి గర్భవతిగా మారి, ఆ గర్భాన్ని తొలగించుకునే క్రమంలో ఓ బాలిక ఏకంగా కన్నుమూసింది. మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కంచిలి మండలానికి చెందిన కిరణ్‌ కోల్‌కతాలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన స్వగ్రామానికి వచ్చారు. ఆ సమయంలో తన భార్య చెల్లెలిలో సన్నిహితంగా ఉండేవారు. దీన్ని గమనించిన బాలిక తల్లి ఆమెను మందలించారు. ఆ తర్వాత కిరణ్‌ కోల్‌కతా వెళ్లిపోయారు.

ఆయన వెళ్లిపోయాక బాలిక గర్భవతి అని తల్లికి తెలిసింది. దీంతో అనుమానం వచ్చి బాలికను నిలదీయగా.. బావతో ఉన్న సంబంధాన్ని బయట పెట్టింది. దీంతో ఆమె కోల్‌కతాలో ఉన్న అల్లుడికి ఫోన్‌ చేసి ప్రశ్నించారు. తాను లాక్‌డౌన్‌లో చిక్కుకున్నానని, ప్రస్తుతానికి అబార్షన్‌ చేయించాలని, డబ్బులు పంపిస్తానని చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక ఈ నెల 8న సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్‌ చేయించారు. అయితే ఈ నెల 16వ తేదీన బాలికకు తీవ్ర రక్తస్రావమై కడుపులో నొప్పి రావడంతో తిరిగి సోంపేట వైద్యులను సంప్రదించారు. చదవండి: ఆస్థి కోసం, త‌ల్లి న‌గ్న చిత్రాల‌ను..

వారి సూచనల మేరకు శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రికి కూడా అదే రోజు సాయంత్రం తీసుకెళ్లారు. అక్కడ నుంచి రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం బాలిక మృతి చెందింది. అబార్షన్‌ సరిగా చేయకపోవడం వల్ల బాలిక మృతి చెందిందని రిమ్స్‌ వైద్యులు నిర్ధారించారని మృతురాలి తల్లి పోలీసులకు చెప్పారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బావ కిరణ్, అబార్షన్‌ చేసిన వైద్యురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గా ప్రసాద్‌ తెలిపారు.
చదవండి: సిగరెట్‌ వెలిగించలేదని మేనల్లుడ్ని..    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా