12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. గొంతు కోసి!

11 Mar, 2020 14:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహిళలపై మానవ మృగాల ఆగడాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా అవసరమైతే బాధితుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడటం లేదు. అత్యాచారాలు అధికంగా నమోదవుతున్న ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. మంగళవారం గ్రామస్తులంతా హోలీ పండగ జరుపుకుంటున్నక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ మైనర్‌ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడి, హత్యాచారానికి పూనుకున్నాడు. ఈ ఘటన ఉన్నావో ప్రాతంలో చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న బాలిక(12)ను స్థానిక యువకుడు పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి, గొంతు కోసి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. (స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లలకు తల్లి విగత జీవిగా..)

కాగా కొంతమంది గ్రామస్తులు పొలం వైపు వెళ్లగా అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గమనించారు. వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్‌లోని హాలెట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలిక తుది శ్వాస విడిచింది. దీంతో గ్రామ ప్రజలంతా ఆసుపత్రికి చేరి ఆందోళన చేపట్టారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (మొబైల్‌ కొనివ్వలేదని.. మనస్తాపంతో)

ప్రియుడి కోసం శ్రీలంకనుంచి..

వీడియోలు లీక్‌.. బాలిక ఆత్మహత్య

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు