ప్రేమ పేరుతో వల, లైంగిక దాడి.. ఆపై బ్లాక్‌ మెయిల్‌

24 May, 2020 21:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఒంగోలు: బాలికను నమ్మించి లైంగిక దాడి చేయడమే కాకుండా బ్లాక్‌మెయిల్‌కు దిగాడు ఓ ప్రబుద్ధుడు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా దిశ పోలీస్‌ స్టేషన్లో పోక్సో చట్టం కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రామయ్య(30) కొంతకాలం క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు బేల్దారి పనులకు వెళ్లాడు. అక్కడ పదహారేళ్ల బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. లాక్‌డౌన్‌ సమయంలో బాలికను తీసుకుని నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన బాలికను రామయ్య తల్లి నిలదీసింది. దీంతో రామయ్య చీమకుర్తిలో ఒక గది తీసుకుని అందులో బాలికను ఉంచాడు. ఈ క్రమంలో ఆమెపై లైంగికదాడి చేసి, వీడియో తీశాడు. వాటితో ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. చదవండి: మొబైల్‌ నెట్‌వర్క్‌ కోసం కొండెక్కితే..!

తనకు తెలిసిన మరో నలుగురి వద్ద లొంగిపోవాలని, తాను చెప్పినట్లు వినకపోతే వీడియోలు బయటపెడతానంటూ బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక అక్కడి నుంచి పరారై ఈనెల 10న ఒంగోలు చేరుకుంది. అక్కడ లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు ఆమెను క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. ఆ సెంటర్‌లో బాలిక మానసికంగా కుంగిపోవడం గుర్తించిన వైద్యుడు శనివారం ఆమెతో మాట్లాడగా.. జరిగినదంతా చెప్పుకుని »బోరుమంది. ఆ విషయాన్ని ఆ వైద్యుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దిశ పోలీసులు బాలికను ప్రభుత్వ వైద్యశాలలోని వన్‌స్టాప్‌ సెంటర్‌కు తరలించి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. రామయ్య, అతడి తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అదనపు కట్నం కోసం పాముతో కాటేయించి..!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా