బాలిక మిస్సింగ్‌.. ఆందోళనలో తల్లి

13 Jun, 2019 17:44 IST|Sakshi
అదృశ్యమైన బాలిక నాగసాయి దుర్గ(16)(పాతచిత్రం)

విజయవాడ: నగరంలో ఓ మైనర్‌ బాలిక మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి బయటికెళ్లిన కూతురి ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లి కలవరపాటుకు గురవుతోంది. కిడ్నాప్‌ చేసి బంధించారేమోనని భయాందోళన చెందుతోంది. వివరాలు.. స్థానికంగా ఉన్న భారతీనగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నాగసాయి దుర్గ(16) నివాసముంటోంది. బెజవాడ మాచవరంలోని ఎస్‌ఆర్‌ఎస్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో నాలుగు రోజుల క్రితం విజయవాడ రామలింగేశ్వర్‌నగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కాలేజీ రీఓపెన్‌ కావడంతో ఈరోజు(గురువారం) ఉదయం 7 గంటలకు అమ్మమ్మ ఇంటి నుంచి భారతీనగర్‌కు కాలినడకన బయలు దేరింది. ఆ తర్వాత అడ్రెస్‌ లేకుండా పోయింది.

భారతీనగర్‌లోని ఇంటికి చేరుకోవాలంటే కిలో మీటర్‌ వరకు నడిచి వచ్చి షేర్‌ ఆటోలో ఇంటికి బయలుదేరి రావాలి. ఐతే 9 గంటలు దాటినా సాయిదుర్గ ఇల్లు చేరలేదు. దీంతో తల్లిలో ఆందోళన మొదలైంది. తెలిసిన వాళ్ల దగ్గర వాకబు చేసినా ఫలితం లేకపోయింది. కచ్చితంగా తన బిడ్డను కిడ్నాప్‌ చేసి ఉంటారని తల్లి అనుమానిస్తోంది. ఈ మేరకు పడమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కేసు మిస్టరీని చేధిస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భర్త వ్యాధులు నయం చేస్తానని మహిళపై..

దారుణం: 24 మంది సజీవ దహనం

డ్రైవర్‌ నిద్రమత్తు.. 9 మంది దుర్మరణం..!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

మద్యం మత్తులో తాళం పగులగొట్టి ఆత్మహత్య

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

పని చేస్తున్నసంస్థకే కన్నం

నీళ్లనుకుని లైజాల్‌ తాగి...

సర్వే అంటూ ఇంటి తలుపుతట్టి..

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

అల్లుడిని చంపిన మామ

వజ్రాల వాటాలో గొడవ.. అందుకే చంపేశాం

నీళ్ల కోసం ఇంత దారుణమా!

డ్రైయినేజీలో ఆలయ హుండీలు!

వైద్యం అందక చిన్నారి మృతి

బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

ఐదేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి

కిలాడీ ‘యాప్‌’తో జర జాగ్రత్త!

కూలి పనులకు వచ్చి కానరాని లోకాలకు..

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

హత్యాయత్నానికి దారి తీసిన విగ్రహ తయారీ

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..