ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం

20 Jun, 2019 11:31 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

కోల్‌కతాలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన శనివారం సాయంత్రం ఆర్మీ తూర్పు కమాండ్‌  హెడ్‌క్వార్టర్స్‌లోని  మైనర్‌ బాలిక ఇంట్లో జరిగింది. బాలిక తండ్రి ఆర్మీ ఉద్యోగి కాగా, బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆర్మీలో కింది స్థాయి (గ్రూప్–డీ) ఉద్యోగి. నిందితుడి  నివాసం కోల్‌కతా ఫోర్ట్‌ విలియంలోని బాలిక ఇంటికి అతి సమీపంలోనే ఉంది. అత్యాచారం చేసిన తరువాత అతను పారిపోవడంతో పోలీసులు మంగళవారం పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లలు రక్షణ) చట్టం కింద అరెస్ట్‌ చేశారు.  కోర్టు ముందు హాజరు పర్చగా, జూన్‌ 24 వరకు పోలీస్‌ కస్టడీ విధించింది.  

మరిన్ని వార్తలు