సజీవదహనంతో బాధితురాలి ఆత్మాహుతి..

11 Sep, 2018 12:19 IST|Sakshi

లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. లైంగిక దాడి జరిగిందనే అవమానంతో మైనర్‌ బాలిక తనకు తాను నిప్పంటించుకున్న ఘటన అలీఘఢ్‌లో వెలుగుచూసింది. బాధితురాలిపై ఇటీవల ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. తనపై నిందితులు ఒడిగట్టిన దారుణాన్ని తండ్రికి చెప్పుకున్న కొద్ది క్షణాలకే బాలిక తనకు తాను నిప్పటించుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, ఈ ఏడాది ఆరంభంలో ఉన్నావ్‌ లైంగిక దాడి ఘటనలో న్యాయం కోరుతూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఇంటి వెలుపల తమను తాము కాల్చుకుని ఆత్మాహుతికి పాల్పడేందుకు ప్రయత్నించిన విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టించింది. ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై ఆరోపణలను సీబీఐ నిర్ధారించింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సల్మాన్‌తో మాట్లాడించకపోయావో...

పోలీసుల అదుపులో అంతర్‌ రాష్ట్ర దొంగ

గండిగుంటలో ‘మృగాళ్లు’

మూడు ముళ్లు.. ఆరు పెళ్లిళ్లు..!

ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాపీ బర్త్‌డే బంగారం

అభిమానులకు తలైవా హెచ్చరిక

‘నేను అలా పిలిస్తే ఆమె స్పృహ తప్పడం ఖాయం’

సమయం లేదు

మేం ముగ్గురమయ్యాం

మరో స్టార్‌ కిడ్‌ ఎంట్రీ