అక్కా చెల్లెలిపై ఐదుగురి లైంగికదాడి..

19 Mar, 2020 08:39 IST|Sakshi

ఇద్దరు మైనర్‌ విద్యార్థినులపై ఐదుగురి లైంగికదాడి

నిందితుల్లో ముగ్గురు మైనర్లు

దూద్‌బౌలి: అభం..శుభం తెలియని మైనర్‌ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వారిని మోసం చేసి లైంగిక దాడికిపాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే.ఈ సంఘటన కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపిన మేరకు.. హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ కుటుంబం తమ ఇద్దరు కూతుళ్లను బంధువుల వద్ద ఉంచి చదివిస్తున్నారు. కొంతకాలం క్రితం బంధువుల ఇంటికి వచ్చిన అక్కాచెల్లెలు స్థానికంగా ఉంటూ సాయంత్రం సమయంలో ట్యూషన్‌ కోసం వెళ్లేవారు. ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళుతున్న సమయంలో అదే ట్యూషన్‌లో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు అమ్మాయిలతో మాటలు కలిపేందుకు ప్రయత్నించారు. స్నేహంగా మాట్లాడుతున్నారని భావించిన అక్కాచెల్లెళ్లు వారితో మాటలు కలిపారు. ఇదే అదునుగా భావించిన మరో విద్యార్థి ప్రేమ వల విసిరాడు. ఒకే ట్యూషన్‌లో తరగతులు కావడంతో ముగ్గురు విద్యార్థులతో కలిసి వచ్చి వెళ్లేవారు.

విద్యార్థులు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా ముగ్గురు మైనర్‌ విద్యార్థులు బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డాఉ.  ఈ విషయం ఎక్కడైన చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ పరిణామాలు అలుసుగా తీసుకున్న నిందితులు తమ స్నేహితులైన తాళం చేతుల రిపేర్‌ చేసే షఫిక్‌ (19), ఇంటర్మీడిట్‌ విద్యభ్యాసం కొనసాగిస్తున్న సైఫ్‌ అలీ (18)తో కలిసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కాచెల్లెలు ట్యూషన్‌ నుంచి ఆలస్యంగా వస్తున్న విషయాన్ని గమనించి ఆరా తీయగా వారిపై జరుగుతున్న వేధింపులను వివరించారు. దీంతో బాధితుల బంధువులు కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.   కేసు నమోదు చేసుకొని లైంగిక దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా