కలకలం: ఎమ్మెల్యేపై కత్తితో దాడి

18 Nov, 2019 09:04 IST|Sakshi
గాయాలతో ఎమ్మెల్యే తన్వీర్‌

సాక్షి, బెంగళూరు: ఎమ్మెల్యేపై కత్తితో డాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన్వీర్‌ సైత్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి మైసూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే పక్కనున్న సిబ్బంది అలర్ట్‌గా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యేను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని ఫర్హన్‌ పాషాగా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన్వీర్‌ ప్రస్తుతం నరసింహారాజ్‌ నియోజవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూస్తూ తన్వీర్‌ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసింందే. అప్పట్లో ఆయనపై పెద్ద దుమారమే చెలరేగింది.

pic.twitter.com/NH813Fic50

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు