పోలీస్ స్టేషన్‌పై కన్నేసి.. 185 ఫోన్‌లు దోచేశారు

14 Jan, 2020 12:07 IST|Sakshi

ముంబై: మన ఇంట్లో ఏవైనా వస్తువులు పోతే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తాం.. మరి పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేస్తే..? అవును మీరు వింటున్నది నిజమే. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.  కొల్హాపూర్ దగ్గర్లోని జైసింగ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కన్నేసి కొల్లగొట్టారు.

లక్షల విలువైన సెల్‌ఫోన్‌లను ఎత్తుకెళ్లారు. స్టేషన్‌లోని స్టోర్ రూపంలో ఉంచిన 185 మొబైల్ ఫోన్‌లు చోరికి గురయ్యాయని అక్కడి పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. చోరీలు, బెదిరింపులు వంటి కేసుల్లో వీటిని స్వాధీనం చేసుకుని స్టోర్ రూంలో పెట్టామని, గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాయని స్టేషన్‌ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇది ఇంటి దొంగల పనే కావొచ్చనే,  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు