విద్యార్థినిపై టీచర్‌ లైంగిక వేధింపులు

21 Aug, 2019 09:04 IST|Sakshi
విచారణ నిర్వహిస్తున్న అధికారులు, పోలీసులు 

విద్యార్థినులపై వికృత చర్యలు

కీచక ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పాడు. సక్రమంగా మార్గంలో పిల్లలను నడిపించాల్సిన ఉపాధ్యాయుడు తానే వక్రమార్గం ఎంచుకున్నాడు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఏపీ మోడల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అదే స్కూల్‌కు చెందిన సైన్స్‌ టీచర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై  విచారణ సాగుతోంది. 

సాక్షి, చిలకలూరిపేట(గుంటూరు) : నాదెండ్ల మండలం చిరుమామిళ్లలోని ఏపీ మోడల్‌ స్కూల్లో కీచక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకొచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సామాన్య శాస్త్ర అధ్యాపకుడు గేరా క్రాంతికిరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. యడ్లపాడు మండలానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని తండ్రి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గదిలోకి రావాలంటూ ఉపాధ్యాయుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ బాలిక తన కుటుంబసభ్యులకు తెలిపింది. పోలీసులు విచారణ చేపట్టగా మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. నాలుగేళ్లుగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్న క్రాంతికిరణ్‌పై సాతులూరు, నాదెండ్ల, చిలకలూరిపేట తదితర గ్రామాలకు చెందిన విద్యార్థినుల కుటుంబసభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో డీఈవో గంగాభవాని ఆదేశం మేరకు విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ పద్మ వద్ద వివరాలు తీసుకున్నారు. క్రాంతికిరణ్‌ వికృత చేష్టలపై ఏడాది క్రితమే ప్రిన్సిపాల్‌కు పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా అతను తీరు మార్చుకోలేదు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదైంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెల్లి హత్యకు ప్రతీకారంగానే బావను హత్య

ఏసీబీ వలలో ఆర్‌ఐ

మర్లగూడెం.. రణరంగం

కుటుంబం అండతోనే పైశాచిక క్రీడ

చిన్నారుల ప్రాణం మీదకు తెచ్చిన నిర్లక్ష్యం

ప్రేమ వ్యవహారంలో మందలించాడని.. 

వివాహితను రక్షించబోయి..ప్రాణాలు కోల్పోయాడు

కారిడార్‌లోనే ప్రసవం.. రక్తపు మడుగులో..

త్రిశూలంతో గుచ్చి.. కళ్లు పొడిచి

కన్న కూతుళ్లపై అత్యాచారం;గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన తల్లి

వ్యసనాలకు బానిసలై జైలుపాలైన విద్యార్థులు

విహారంలో విషాదం 

టగ్‌ ప్రమాదం: మరో ఇద్దరి మృతి

సీఎం మేనల్లుడికి ఈడీ షాక్‌ 

సిండికేటు గాళ్లు..!

భర్త ఇంటి ముందు వివాహిత నిరసన 

కిడ్నాపర్‌ను పట్టుకున్న గ్రామస్తులు

పోలీసుల అదుపులో టీడీపీ ‘కీ’ లేడీ

అత్తను హత్య చేసిన కోడలి అరెస్ట్‌

ప్రియునితో కలిసి తండ్రిని హతమార్చిన బాలిక

పెళ్లయిన మూడు నెలలకే.. 

నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు

దొంగగా మారిన రైల్వే కూలీ

ఏసీబీ వలలో జీఎంసీ బిల్‌ కలెక్టర్‌

ప్రియురాలితో తాజ్‌మహల్‌ చూడాలనుకుని..

చిన్నారిపై పాఠశాల కరస్పాండెంట్‌ పైశాచికత్వం

విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి.. కిరోసిన్‌ పోసి..

బాత్రూంలో బంధీగా చిన్నారి ; చివరికి

వీడెంత దుర్మార్గుడో చూడండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు