వివాహితపై ఆడపడుచు భర్త లైంగిక దాడి

10 Feb, 2020 10:46 IST|Sakshi

పశ్చిమగోదావరి, కొవ్వూరు : వరుసకు సోదరుడయ్యే వ్యక్తి (ఆడపడుచు భర్త) ఆరికిరేవుల గ్రామానికి చెందిన ఓ వివాహితపై లైంగిక దాడికి తెగబడ్డాడు. జనవరి 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చీటీల వ్యాపారం చేస్తుంటాడు. ప్రతి శుక్రవారంఆరికిరేవుల వస్తుంటాడు. ఆ గ్రామానికి చెందిన తన బావమరిది ఇంటికి ప్రతివారం  వస్తుండేవాడు. జనవరి 31న ఉదయం వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బావమరిది భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు తీసి బయట ఎవరికైనా చెబితే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని, మౌనంగా ఉంటే రూ.ఐదువేలు ఇస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన వివాహిత అప్పటి నుంచి బాధను దిగమింగుకుని మౌనంగానే రోధిస్తోంది. ఎట్టకేలకు విషయం  భర్త, అత్తమామలకు చెప్పి వారి సహకారంతో శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.   


 

మరిన్ని వార్తలు