చిన్నారిపై లైంగిక దాడికి యత్నం!

26 Dec, 2019 12:32 IST|Sakshi

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): గొల్లపాలెంగట్టు జోడు బొమ్మల సెంటర్‌లో ఓ చిన్నారిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం జోడు బొమ్మల సెంటర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వెనుక నడుచుకుంటూ వస్తుండగా, జోడుబొమ్మల ప్రాంతానికి చెందిన ఎం. ఉదయ్‌కికణ్‌ ఆ చిన్నారిని ఆడిస్తున్నట్లు నటిస్తూ చీకటి సందులోకి తీసుకెళ్లాడు. తమతో పాటు వస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెనక్కి వెళ్లి చూశారు. అయితే, చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ యువకుడు కనిపించాడు. దీంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ యువకుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని కొత్తపేట సీఐ ఎండీ ఉమర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు