బిస్కెట్‌ ఆశచూపి..

8 Oct, 2018 08:50 IST|Sakshi

బాలికపై లైంగిక దాడికి యత్నం

నిందితుడి అరెస్ట్‌

ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

హిమాయత్‌నగర్‌: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి బిస్కెట్‌ ఆశ చూపి లైంగికదాడికి యత్నించిన సంఘటన నారాయణగూడ పీఎస్‌ పరిధిలోని హైదర్‌గూడలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి....హైదర్‌గూడకు చెందిన యూసఫ్‌ఖాన్‌ తోపుడు బండిపై కర్చీఫ్‌ల వ్యాపారం చేసేవాడు. ఇతని ఇంటి సమీపంలో కొద్దిరోజులుగా నాందేడ్‌కు చెందిన కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంట్లోని బాలిక(9)పై కన్నేసిన యూసఫ్‌ఖాన్‌ ఆదివారం ఉదయం బిస్కెట్‌ ఇస్తానంటూ ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించడమేగాక లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలు ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో అతను నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు యూసఫ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు