అత్తపై అల్లుడి లైంగిక దాడి

2 Aug, 2019 10:54 IST|Sakshi

చాంద్రాయణగుట్ట: అత్తపై లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం...కందికల్‌ గేట్‌ ప్రాంతానికి చెందిన  ఓ మహిళ (40) తన కుమార్తెను బాలాపూర్‌ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు నడిపే ఎ.భాస్కర్‌(28)తో వివాహం జరిపించారు. కాగా గత నెల 31న అర్ధరాత్రి 12.10 గంటలకు భాస్కర్‌ బైక్‌పై అత్తను గుర్రం చెరువు కట్టపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె కేకలు వేసి...జరిగిన విషయమై చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  పోలీసులు భాస్కర్‌ను అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా