మద్యం ఎర.. విద్యార్థినిపై లైంగిక దాడి

21 Dec, 2019 10:39 IST|Sakshi
ధ్వంసమైన మయిల్‌ స్వామి ఇంట్లోని వస్తువులు (ఇన్‌సెట్‌) మయిల్‌ స్వామి

తమిళనాడు ,సేలం: తాగుబోతు తండ్రికి మద్యం ఎరగా చూపి తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఇద్దరు దుర్మార్గులు సామూహికంగా లైంగికదాడికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈరోడ్‌ జిల్లా గోపిచెట్టి పాళయం సమీపంలోని కూగలూర్‌ ప్రాంతానికి చెందిన కూలీ కార్మికుడు కుమార్‌. ఇతని భార్య బేబి. వీరికి 9 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కొంతకాలం భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా బేబీ తన ఇద్దరు పిల్లలను కుమార్‌ వద్దే వద్దిలి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్తె, కుమారుడితో ఉంటున్న కుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం మత్తులో గడిపేవాడు. ఇద్దరు పిల్లలు ఇరుగుపొరుగు వాళ్లు పెట్టే తిండి తింటూ, సమీపంలోని జాతీయ బాలకార్మికుల నిర్మూల శిక్షణ కేంద్రంలో చదువుకుంటూ వచ్చారు. 

బాలికకు అస్వస్థత
ఎప్పటిలానే కుమార్‌ కూతురు గురువారం పాఠశాలకు వెళ్లింది. అకస్మాత్తుగా ఆమెకు తీవ్ర కడుపు నొప్పి ఏర్పడడంతో పాఠశాల నిర్వాహకులు ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు తెలిసింది. సమాచారం తెలిసి బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సామూహిక లైంగిక దాడి
నిత్యం మద్యం మత్తులో గడిపే కుమార్‌ ఇంటికి సమీపంలో అరుణాచలం, మయిల్‌ స్వామి ఉన్నారు. వీరు కుమార్‌కు మద్యం కోసం డబ్బులిచ్చేవారని, ఆ తర్వాత అందుకు బదులుగా అతని కుమార్తెపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడేవారని తెలిసింది. బుధవారం రాత్రి కూడా అరుణాచలం, మయిల్‌ స్వామి ఆ బాలికపై లైంగికదాడి జరిపినట్టు సమాచారం. దీంతో ఆమె గురువారం అనారోగ్యం పాలయ్యింది. పోలీసులు అరుణాచలంను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మయిల్‌ స్వామి, బాలిక తండ్రి కుమార్‌ కోసం గాలిస్తున్నారు.

గ్రామస్తులు ఆగ్రహం
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మయిల్‌ స్వామిని అరెస్టు చేయలేదని తెలిసి అతడి ఇంటిని ముట్టడించి ఇంట్లో ఉన్న టీవీ, కుట్టుమిషన్‌ తదితర వస్తువులను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్థి చెప్పి పంపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తండ్రి ప్రవర్తనపై విసుగు చెంది.. 

నిన్న కళాశాల.. నేడు చెరసాల

పాలకొండలో కారు బీభత్సం..

బాలిక కిడ్నాప్‌, బలవంతంగా పెళ్లి

పగలు రాత్రి రేవ్‌ పార్టీలు

పరీక్ష సరిగా రాయలేదని..

ఇటుదటు... అటుదిటు!

సూసైడ్‌ నోట్‌ రాసి.. ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

బావల వేధింపులే కారణం..

లైంగిక దాడి యత్నం; తండ్రికి పదేళ్ల జైలు 

చిన్నారి పట్ల అసభ్యకరంగా...

జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

‘బార్‌, హోటళ్ల యాజమానులు జాగ్రత్తగా ఉండాలి’

తెలంగాణ హై​కోర్టులో వాడీ వేడిగా వాదనలు

విశాఖలో ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’  

కుమార్తె గొంతుకోసి.. భార్య ఉసురు తీసి!

వివాహితుల సహజీవనం తెచ్చిన తంటా!

వివాహితుడు దారుణ హత్య?

పోచంపల్లిలో దారుణ హత్య

ఎంత పని చేశావు నిహారికా

అమ్మ కోసం..రాత్రంతా దీనంగా..

మృగాడికి మరణ దండన

అల్లరి చేయొద్దన్నందుకు.. ఇంట్లోకి దూరి హత్య

భివండీలో తెలుగు యువతి ఆత్మహత్య

పక్కచూపుల నిఘా కన్ను 

బామ్మ ఇంటికే కన్నం .. నిందితుడి అరెస్ట్‌

వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో..

బెంగళూరులో మహిళా కండక్టర్‌పై యాసిడ్‌ దాడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేరస్తులు తప్పించుకోలేరు

కొత్త ఏడాది బ్యూటిఫుల్‌

ఈ సినిమాతో హ్యాట్రిక్‌ షురూ

వెబ్‌ సిరీస్‌లో హెబ్బా

నితిన్‌ పవర్‌పేట

అతిథి