విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి

22 Dec, 2019 08:00 IST|Sakshi
గూండా చట్టం కింద అరెస్టయిన పప్స్‌కార్తి, మణికంఠన్, రాహుల్‌

తిరువొత్తియూరు: కోవై సీరనాయకన్‌ పాళయంకు చెందిన ప్లస్‌ వన్‌ విద్యార్థిని గత నెల 26వ తేదీ తన ప్రియుడితో కలిసి ఇంటికి నడిచి వెళ్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆరుగురికి చెందిన ముఠా ప్రియుడిపై దాడిచేసి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ సామూహికంగా లైంగిక దాడి చేశాడు. దీనికి సంబంధించి విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోవై వెస్టు మహిళా పోలీసు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన సీరనాయకన్‌ పాళయంకు చెందిన మణికంఠన్‌ (27), పప్సకార్తి (26), రాహుల్‌ (21), ప్రకాష్‌ (22), కార్తికేయన్‌ (28), నారాయణమూర్తి (32)ని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆరుగురినీ కోర్టులో హాజరు పరిచి కోవై జైలుకు తరలించారు. అరెస్టు అయిన మణికంఠన్, పప్స్‌ కార్సీ, రాహుల్‌పై పలు నేరాలు ఉండడంతో వీరిని గూండా చట్టం కింద అరెస్టు చేయడానికి పోలీసులు కార్పొరేషన్‌ కమిషనర్‌కు సిఫారసు చేశారు. ఆ సిఫారసును పరిశీలించిన కమిషనర్‌ సుమిత్రరాణి ముగ్గుర్నీ గూండా చట్టం కింద అరెస్టు చేయడానికి అనుమతి ఇచ్చారు. పోలీసులు ముగ్గురిపై శనివారం గూండా చట్టం ప్రయోగించి, అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు