17ఏళ్ల బాలికకు బలవంతంగా విషం తాగించి..

13 Jan, 2019 12:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలికి బలవంతంగా విషం తాగించి ఆమె నోరు శాశ్వతంగా మూయించడానికి యత్నించారు ఇద్దరు దుండగులు. 17 ఏళ్ల బాలిక(అత్యాచార బాధితురాలు) ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ద్వారకా జిల్లా హస్తసాల్ ప్రాంతంలో గురువారం చోటు చేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూషన్‌కి వెళ్లి వస్తున్న బాలికను రోడ్డుపై అడ్డుకున్న దుండగులు కోర్టులో నిందితుడిపై సాక్ష్యం చెప్పొద్దంటూ బెదరించారు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను బంధించి బలవంతంగా విషం తాగించి, అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు స్పృహకోల్పోయి కిందపడింది. గమనించిన స్థానికులు ఓ ఆటో రిక్షాలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. శుక్రవారంనాడు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. 

కాగా, బాధితరాలిపై అత్యాచారం కేసులో నిందితుడు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. అతనిపై గత ఏడాది అత్యాచారం కేసు నమోదైంది. తాజాగా బాధితురాలిపై విషం తాగించిన ఘటనకు సంబంధించి అతన్ని ప్రశ్నిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసలు తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెడికల్ ఆఫీసరు.. మందు తాగితే రెచ్చిపోతారు!..

ప్రేమించినవాడు కాదన్నాడని...

తెనాలిలో దారుణం: ప్రియురాలి మీద అనుమానంతో..

జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఏం జరిగిందో..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!