బంగారం ఎత్తుకెళ్లిన కోతులు

3 Mar, 2020 02:14 IST|Sakshi

రెబ్బెన (ఆసిఫాబాద్‌): దొంగలు ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లినట్లు సాధారణంగా వింటుంటాం. కానీ.. కోతులు ఇంట్లో చొరబడి బంగారు నగలు ఎత్తికెళ్లిన విచిత్ర సంఘటన కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి. అయితే.. ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్‌ ఉన్నాయి. స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదని వాపోయింది. 

మరిన్ని వార్తలు