నిన్న కఠిన చట్టం.. నేడు మరో ట్రిపుల్‌ తలాక్‌

29 Dec, 2017 11:29 IST|Sakshi

లక్నో : ట్రిపుల్‌ తలాక్‌ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం ముద్ర వేయించుకున్న మరుసటి రోజే ఉత్తర ప్రదేశ్‌లో మరో వ్యవహారం వెలుగు చూసింది. మొరానాబాద్‌కు చెందిన వరిషా.. తన భర్త తనకు ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు ఇచ్చాడని చెబుతున్నారు. 

ఈ ఉదయం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... ‘‘నా భర్త కట్నం కోసం గత కొంత కాలంగా హింసిస్తున్నాడు. 10 లక్షల రూపాయలు లేదా కారు ఏదో ఒకటి ఇస్తేనే ఇంట్లో ఉండాలని.. లేకపోతే బయటకు వెళ్లిపోవాలని చెప్పాడు. ఆ వెంటనే ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు ఇచ్చానన్నాడు’’ అని వరిషా చెప్పారు. అయితే ఈ అంశంపై ఆమె భర్త, పోలీసులు స్పందించాల్సి ఉంది. 

కాగా, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. అయితే ప్రస్తుతం అది రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. 

మిగిలిన మతాల్లో లేరా: ఒవైసీ

మరిన్ని వార్తలు