గిల్టు నగలు తాకట్టు: రూ.39 లక్షలకు టోకరా

19 Dec, 2017 19:41 IST|Sakshi

అన్నానగర్‌: బ్యాంకులో గిల్టు నగలు తాకట్టుపెట్టి రూ.39 లక్షల రుణం తీసుకున్నాడో ఉద్యోగి. తమిళనాడులోని నాగై జిల్లా తిరుక్కడైయూర్‌ మేలవీధికి చెందిన బాలాజి (40) అదే ప్రాంతంలో ఉన్న ఓ బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను గిల్టు నగలను బ్యాంకులో కుదువబెట్టి మోసానికి పాల్పడ్డట్టు బ్యాంక్‌ అధికారి కబాలీశ్వరన్‌కు సమాచారం అందింది. దీనిపై విచారణ జరపగా బాలాజీ కవరింగ్‌ నగలను కుదువబెట్టి రూ.39 లక్షల 46 వేల 206ల రుణం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై బ్యాంకు అధికారి కబాలీశ్వరన్‌ నాగై జిల్లా నేర విభాగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ముణియాండి, ఎస్‌ఐ సుమతి బ్యాంకుకు వచ్చి కేసు నమోదు చేసి బాలాజీని అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు కార్లు, వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు