ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య 

18 May, 2020 08:47 IST|Sakshi

సాక్షి,  పిడుగురాళ్ల ‌: ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం  పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని తుమ్మలచెరువు గ్రా మానికి చెందిన గన్నారపు రంగారెడ్డి కుమార్తె రాధికకు వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన జూలకంటి వెంకటరెడ్డి, నాగమ్మల రెండో కుమారుడు లచ్చిరెడ్డితో 2013లో వివాహమైంది. వ్యాపారం కోసం లచ్చిరెడ్డి, ఆయన సోదరుడు నారాయణరెడ్డి కుటుంబాలు కలిసి హైదరాబాద్‌లోని కేబీసీ కాలనీలో జీవనం సాగిస్తున్నాయి. అయితే  ఏప్రిల్‌ 14న నారాయణరెడ్డి, హర్షితల కుమార్తె లిసిక (3) మరుగుదొడ్లు శుభ్రం చేసే  ద్రావణం తాగి మరణించింది. కానీ లిసిక మరణానికి  రాధిక కారణం అంటూ కుటుంబంలో కలహాలు మొదలయ్యా యి.

గురువా రం  ఉదయం 11 గంటలకు రాధికను తుమ్మలచెరువు గ్రామంలో ఆమె తల్లి ఇంటి వద్ద విడిచి భర్త లచ్చిరెడ్డి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. రాధిక (27) ఆ అపనిందను భరించలేక ఆదివారం తన ఇద్దరు పిల్లలు కృషిదీప్‌రెడ్డి (4), రిషిక (13 నెలలు)లను దిండుతో అదిమిపెట్టి చంపి తాను ఉరివేసుకొని మృతి చెందింది. రేషన్‌ తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె తల్లి ఇంటికొచ్చి చూసేసరికి కుమార్తె ఉరివేసుకొని కనిపించింది. హర్షితకు చెప్పండి... నేను ఎలాంటి తప్పూ చేయలేదు నాన్నా.. అంటూ తన మరణానికి కారణం తెలియజేస్తూ రాసిన లేఖ ఆమె మృతదేహం వద్ద గుర్తించారు. సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి,  సీఐ కె. ప్రభాకర్, ఎస్‌ఐ సుధీర్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు