కన్నకొడుకుని హత్య చేసిన తల్లి

12 Jul, 2020 11:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని అక్కయ్యపాలెం మండలంలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. రోజు తాగి వచ్చి గొడవపడుతున్నాడన్న కారణంతో కన్నతల్లి కొడుకును దారుణంగా హతమార్చింది. వివరాలు.. అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌కు చెందిన అశోక్‌ వర్మ తల్లి వరలక్ష్మీ, సోదరి శ్రీదేవి, బావ వెంకటేశ్వర రాజుతో కలిసి నివసిస్తున్నాడు. రాడ్‌ వెండర్‌గా పనిచేసే అశోక్‌ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి తల్లి వరలక్ష్మీ, సోదరి శ్రదేవితో తరచూ గొడవపడుతుండేవాడు. శనివారం రాత్రి కూడా ఇదేవిధంగా తాగి వచ్చిన అశోక్‌ తల్లి, అక్క శ్రీదేవితో గొడవపడ్డాడు. దీంతో వేధింపులు భరించలేక వరలక్ష్మీ పక్కనే ఉన్న రోకలిబండను తీసుకొని అశోక్‌ వర్మ తలపై బలంగా కొట్టింది. దీంతో అశోక్‌ వర్మ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలిని సందర్శించారు. హత్యకు పాల్పడిని వరలక్ష్మీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు