ఉసురు తీసిన వేధింపులు

17 Jul, 2019 09:33 IST|Sakshi
కుమారులతో కలిసి అంజలి చివరిసారిగా దిగిన సెల్ఫీ

పార్శిగుట్టలో దారుణం

ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

తల్లి మృతి...చిన్నారుల పరిస్థితి విషమం

కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఛిద్రమైంది. భర్త వేధిస్తున్నాడని మనస్తాపంతో ఓ వివాహిత కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తన ఇద్దరు పిల్లలకు తాగించి..తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సికింద్రాబాద్‌ పరిధిలోని పార్శిగుట్టలో మంగళవారం చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనలో తల్లి అంజలి మృతి చెందగా..ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భర్త వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అంజలి సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. 

చిలకలగూడ : భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ తన ఇద్దరు కుమారులకు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పార్శీగుట్టలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లి అంజలి మృతి చెందగా, కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెదక్‌జిల్లా రామాయంపేటకు చెందిన ప్రసాద్‌ నగరానికి వలస వచ్చి కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. పన్నెండేళ్ల క్రితం పార్శిగుట్టకు చెందిన అం జలి (28)ని వివాహం చేసుకుని అక్కడే ఉంటున్నాడు. వారికి ఇద్దరు కుమారులు అనిరుధ్‌ (10), అమృత్‌తేజ్‌ (08) ఉన్నా రు.  అంజలి ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. మద్యానికి బానిసైన ప్రసాద్‌ భార్యపై అనుమానంతో ఆమెను తరచూ వేధించేవాడు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోగా ఆమె సంపాదన కూడా లాక్కునేవాడు.

అంజలి మృతదేహం, చికిత్స పొందుతున్న అనిరుద్,అమృత్‌తేజ్‌

అతడి వేధింపులు తాళలేక గతంలో చిలకలగూడ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించినా ప్రసాద్‌ వైఖరిలో మార్పు రాకపోవడంతో బేగం పేట మహిళా పోలీస్‌ స్టేషన్‌కు రెఫర్‌ చేశారు. అంజలి ఫిర్యాదు మేరకు గత నెల 15న పోలీసులు ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన అంజలి మం గళవారం మజాలో పురుగుల మందు కలిసి ఇద్దరు పిల్లలకు తాగించి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తరువాత కొద్దిసేపటికే పెద్ద కుమారుడు అనిరుధ్‌ వాంతి చేసుకున్నాడు. అప్పటికే తమ్ముడు అమృత్‌తేజ్‌తోపాటు తల్లి అం జలి కిందపడి నురగలు కక్కుతుండటంతో అతను చుట్టుపక ్క  వారికి చెప్పాడు. స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆ స్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు వారిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యం లో అంజలి మృతి చెందింది. అమృత్‌తేజ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు గాంధీ వైద్యులు తెలిపారు. కాగా భర్త వేధింపులు భరించలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు అంజలి తన సూసైట్‌నోట్‌లో పేర్కొంది.  

చివరిసారిగా సెల్ఫీ..  
ఆత్మహత్యాయత్నానికి కొన్ని నిమిషాల ముందు అంజలి తన ఇద్దరు పిల్లలతో కలిసి సెల్ఫీ దిగింది. అదే ఫొటోను వాటాప్స్‌ డీపీలో పెట్టుకుంది.  మృతురాలి తల్లి కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. బేగంపేట పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు