ఉరితాడై బిగుసుకున్న కుటుంబ కలహాలు

25 Jan, 2019 12:40 IST|Sakshi
పిల్లలు శౌర్య, సుప్రీత్, తల్లి ఆశ(ఫైల్‌)

ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య  

కర్ణాటక, మైసూరు:   కుటుంబ కలహాలు ఇద్దరు పిల్లలకు ఉరితాడై బిగుసుకున్నాయి. ఓ తల్లి చేజేతులా తన ఇద్దరు   పిల్లలకు ఉరివేసి అనంతరం తానూ బలవన్మరణం చెందింది. ఈఘటన గురువారం నగరంలోని బండిపాళ్యలో చోటు చేసుకుంది. బండిపాళ్యలో నివసిస్తున్న ఆశా(30),మహేశ్‌ దంపతుల మధ్య చాలా కాలంగా ఏదో విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయి.బుధవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్థాపం చెందిన ఆశా గురువారం తన ఇద్దరు కవల పిల్లలు శౌర్య(8),సుప్రీత్‌(8)లను హత్య చేసి అనంతరం తాను కూడా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కొద్ది సేపటి అనంతరం ఇంటికి వచ్చిన మహేశ్‌ ఎంత పిలిచినా భార్య తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆశా రాసిన డెత్‌నోట్‌ స్వాధీనం చేసుకున్నారు.అందులో తమ మరణాలకు ఎవరూ కారణం కాదని తన వల్ల తన కుటుంబానికి అవమానం జరిగిందనే మనస్థాపంతోనే పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు డెత్‌నోట్‌లో పేర్కొన్నారు.తమ ముగ్గురిని ఒకే చితిలో దహనం చేయాలని కూడా ఆశా అందులో రాసారు.మైసూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా