కొడుకును కడతేర్చిన తల్లి

23 Feb, 2020 02:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధం బయటపడుతుందనే.. 

ప్రియుడితో కలిసి దారుణం 

నల్లగొండ జిల్లాలో ఘటన 

నల్లగొండ క్రైం: వివాహేతర సంబంధం బయటపడుతుందనే ఉద్దేశంతో.. ప్రియుడితో కలసి ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా బుద్ధారంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.  గ్రామానికి  చెందిన వెంకన్న–విజయకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా విజయ గ్రామానికి చెందిన  వెంకట్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తో్తంది. శుక్రవారం మధ్యాహ్నం వెంకట్‌రెడ్డి విజయ ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో రెండో కుమారుడు నాగరాజు (7) ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్ద కుమారుడు బయట ఆడుకుంటున్నాడు. విజయ, వెంకట్‌రెడ్డి చనువుగా ఉన్న సమయంలో నాగరాజు గమనించి నాన్నకు, నాన్నమ్మకు చెప్తానన్నాడు. వెంటనే తల్లి నాగరాజు చెంపపై కొట్టగా.. గట్టిగా ఏడ్చాడు. ఎవరైనా చూస్తున్నారా అని ఇంటి బయటికి వచ్చి చూసింది. ఇరుగుపొరుగు వారు కుమారుడు ఎందుకు ఏడుస్తున్నాడని అడగడంతో కడుపు నొప్పి ఉందని, అందుకే ఏడుస్తున్నాడని చెప్పింది. తల్లి మళ్లీ ఇంట్లోకి వెళ్లి నాగరాజుని ఏడ్వవద్దని చెప్పింది. మళ్లీ వెంకట్‌రెడ్డితో చనువుగా ఉండటంతో విషయాన్ని అందరికీ చెప్తానని నాగరాజు అన్నాడు. దీంతో విషయం బయటపడుతుందని భయపడి ప్రియుడితో కలసి బాలుడి గొంతుకు టవల్‌ బిగించి హతమార్చారు. 

ఆర్థిక సంబంధాలతో చనువు
విజయ కుటుంబానికి తోకల వెంకట్‌రెడ్డి రూ.లక్ష అప్పు ఇచ్చాడు. రూ.50 వేలు తిరిగి ఇచ్చినప్పటికీ మరో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అప్పుడప్పుడు వెంకట్‌రెడ్డికి వ్యవసాయ పని కోసం ట్రాక్టర్‌ దున్నటానికి విజయ భర్త వెంకన్న వెళ్లేవాడు. భార్య విజయ వెంకట్‌రెడ్డితో చనువుగా ఉంటుందన్న విషయం తెలిసిన వెంకన్న గతంలో విజయ, వెంకట్‌రెడ్డిలను మందలించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు