కూతురి కళ్లెదుటే.. తల్లి దారుణ హత్య

13 Mar, 2018 08:45 IST|Sakshi
మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఏఎస్పీ, డీఎస్పీ

కాటారం మండలంలోని కొత్తపల్లిలో ఘటన

 కుమార్తెను కట్టేసి తల్లిని కిరాతకంగా చంపిన దుండగులు

 ముఖంపై కత్తిపీటతో  విచక్షణ రహితంగా దాడి

మృతురాలు టీడీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు

కాటారం: కూతురిని కట్టేసి తల్లిని అతి కిరాతకంగా దుండగులు చంపిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం మండలంలోని కొత్తపల్లికి చెందిన రా మిళ్ల కవిత(36)కు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రామిళ్ల మల్లయ్యకు 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతుళ్లు శిరీష, సిరిణి ఉన్నా రు. వివాదాల కారణంగా భార్యభర్తలిద్దరు సుమారు 10 సంవత్సరాలుగా వేరువేరుగా జీవనం కొనసాగిస్తున్నారు. కవిత తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లిలో ఇల్లు నిర్మించుకుని ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. ప్రస్తుతం టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతోంది.

ఇదే క్రమంలో కవిత ఆదివారం రాత్రి పెద్ద కూతురు శిరీషతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు దుండగులు కిటికీలో నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. వచ్చి రావడంతోనే కవితపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఇది గమనించిన కూతురు శిరీష అరవడానికి ప్రయత్నించింది. దుండగులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి పక్క గదిలో పడవేశారు. మంచం పక్కనే గల కత్తిపీటతో కవిత మొఖంపై విచక్షణ రహితంగా కొట్టి చంపేశారు. ముఖం పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా మారిపోవడంతోపాటు ఒక వైపుగల కనుగుడ్డు చిట్లిపోయింది.

కవిత కూతుర్లు శిరీష, సిరిణి..(ఇన్‌సెట్లో మృతురాలు కవిత ఫైల్‌ ఫోటో)
కళ్ల ముందే తల్లిని చంపడంతో తీవ్ర భయాందోళనకు గురైన శిరీష కాళ్లు చేతులు కట్టివేయడంతో తెల్లవారేవరకు అదే గదిలో ఉండిపోయినట్లు స్థానికులు తెలిపారు. తెల్లవారిన తర్వాత కట్లను విప్పుకుని శిరీష ఇంటి పక్కనగల బంధువులకు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం బయటకు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన దుండగులు మంకీ క్యాప్, మాస్క్‌లు ధరించినట్లు శిరీష పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కవిత ఒకరిద్దరితో సన్నిహితంగా ఉండేదని, వారి తరఫు కుటుంబ సభ్యులెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందుకున్న ఏఎస్పీ రాజమహేంద్రనాయక్, కాటారం డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌రావు, సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి నిందితుల ఆనవాళ్లను నమోదు చేసుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌ సంఘటన స్థలం నుంచి ప్రధాన రహదారి వద్దకు వెళ్లి ఆగిపోయింది. నిందితులు బైక్‌పై వచ్చి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నింది తులను త్వరలోనే పట్టుకుని శిక్ష పడేలా చూస్తామని ఏఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు