తల్లిని ఏజెంట్లు సౌదీలో అమ్మేశారని ఫిర్యాదు

13 Feb, 2018 09:13 IST|Sakshi
క్రిష్ణమ్మ (ఫైల్‌)

మదనపల్లె టౌన్‌ : తన తల్లిని ఇద్దరు ఏజెంట్లు సౌదీలో సేట్‌కు అమ్మేశాడని, ఏడాదిగా ఆమె ఆచూకీ లేదని కుమార్తెలు వాపోయారు. వారు సోమవారం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం సీటీఎం రోడ్డులోని శివాజీ నగర్‌లో ఉంటున్న భవన నిర్మాణ కార్మికుడు పి.రామ్మూర్తి, క్రిష్ణమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రామ్మూర్తి  సంపాదనతో ఇళ్ల గడవడం కష్టం కావడంతో ఇబ్బందులు పడేవారు. కుటుంబం ఆర్థికంగా బయటపడేందుకు ఇతర దేశాలకు పనికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

రాయచోటికి చెందిన ఏజెంట్లు జిలానీబాషా, మహ్మద్‌బాషాను ఏడాది క్రితం ఆశ్రయించారు. వారు క్రిష్ణమ్మకు సౌదీలోని ఉమర్‌కు చెందిన అబ్దుల్‌మినిమ్‌ సేట్‌ వద్ద దగ్గర ఉపాధి కల్పిస్తానని చెప్పి 11 నెలల క్రితం సౌదికి పంపించారు. ఇప్పటి వరకు ఆమె తమకు ఫోన్‌ చేయలేదని, ఆమె ఆచూకీ లేదని కుమార్తెలు, భర్త రామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆరు నెలలుగా ఏజెంట్లను అడుగుతున్నా సమాధానం లేదన్నారు. పైగా అనుచరులతో దాడి చేయిస్తున్నారని కన్నీటిపర్వంతమయ్యారు. విచారణ చేసి ఎలాగైన తమ తల్లిని ఇండియాకు రప్పించి ఏజెంట్లపై చర్యలు తీసుకోవలని సీఐ సురేష్‌కుమార్‌ను కోరారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా