ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వేధింపులు

28 Aug, 2018 02:26 IST|Sakshi
విగత జీవులుగా చిన్నారులు

 ఇద్దరు కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

కుంటాల (ముథోల్‌): ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలను చంపి.. తానూ ఆత్మహత్యకు పాల్పడిందో తల్లి. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కుంటాల మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అంబుగామ గ్రామానికి సుశీల–సంతోష్‌ దంపతులకు స్వప్న (18నెలలు), చిన్న కూతురు (3 నెలలు) సంతానం. అయితే ఇద్దరూ ఆడపిల్లలు పుట్టారని భర్త సంతోష్, అత్త తారుబాయి వే«ధింపులకు గురిచేశారు. భర్త, అత్త సోమవారం కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఆమె పిల్లలను తొలుత హతమార్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే పండుగ రోజు వీలుకాకపోవడంతో రాఖీ కట్టేందుకు తన భర్తతో కలసి అంబుగాంకు సంతోష్‌ సోదరి సవిత వచ్చింది. బయట తలుపులు తెరిచి ఉండటంతో  లోపలికి వెళ్లి చూడగా మరో గదిలో తలుపు గడియ వేసి ఉంది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపు తీయగా అప్పటికే సుశీల దూలానికి ఉరివేసుకుంది. ఇద్దరు చిన్నారులు ఊయల పక్కనున్న మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. భైంసా డీఎస్పీ రాములు, గ్రామీణ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై యూనిస్‌ అహ్మద్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. తన కూతురు, మనుమరాళ్ల చావుకు కారణం అత్తింటి వేధింపులేనని సుశీల తల్లిదండ్రులు బోరున రోదించారు.  

మరిన్ని వార్తలు