రోడ్డు ప్రమాదంలో దర్శకుడు దుర్మరణం

23 Mar, 2019 13:14 IST|Sakshi
హ్యారిస్‌ హౌదాల్‌ (ఫైల్‌)

యశవంతపుర : చెట్టుకు కారు ఢీకొని యువ దర్శకుడు మృతి చెందిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడుబిద్రె శిర్థాడి వద్ద జరిగింది. మృతుడిని దర్శకుడు హ్యరిస్‌ హౌదాల్‌ (30)గా గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున హ్యరిస్‌ నిద్రమత్తులో ఉండి కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. హ్యరిస్‌ కారులో మూడుబిద్రె నుండి శిరిడికు తెల్లవారుజామున వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఒక్కడే ఉన్న హ్యారిస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు