మహిళా నిర్మాత అరెస్టు

9 Dec, 2018 11:00 IST|Sakshi

సాక్షి, ముంబై : చీటింగ్‌ కేసులో సినిమా నిర్మాత ప్రేరణ అరోరాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన నేపథ్యంలో డిసెంబరు 10 వరకు ఈఓడబ్ల్యూ(ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌) కస్టడీ పొడగించినట్లు పేర్కొన్నారు. వివరాలు... క్రిఆర్జ్‌ ఎంటరేన్‌మెంట్‌ అధినేత ప్రేరణ అరోరా పలు చిత్రాల హక్కులు ఇప్పిస్తానంటూ తన వద్ద 32 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఫిల్మ్‌ మేకర్‌ వషు భగ్నానీ ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన హక్కులు వేరే వ్యక్తులకు బదలాయించి తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫనేకాన్‌‌, బట్టి గుల్‌ చాలు మీటర్‌ వంటి చిత్రాల హక్కులు తనకు దక్కకుండా చేశారని, తనతో పాటుగా మరికొంత మందిని కూడా ప్రేరణ ఇలాగే మోసం చేశారంటూ ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముంబై ఈఓడబ్ల్యూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

కాగా ప్రేరణ అరోరాపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. జాన్‌ అబ్రహం చిత్రం పరమాణు, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌- సారా అలీఖాన్‌ జంటగా తెరకెక్కిన కేదార్‌నాథ్‌ వంటి సినిమాల హక్కుల విషయంలో కూడా ఆమెపై పలు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు