పేయింగ్‌ గెస్ట్‌.. తన రూమ్‌మేట్స్‌తో కలిసి..

6 Jun, 2019 09:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితుడే తనపై ఘాతుకానికి పాల్పడటంతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. బాధితురాలు(25) అంధేరీలోని గోని నగర్‌లోని ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. ఉద్యోగరీత్యా ఎయిర్‌హోస్టెస్‌ అయిన సదరు యువతికి.. తమ కంపెనీలో పనిచేసే స్వప్నిల్‌ బడోడియాతో స్నేహం కుదిరింది. అతడు కూడా అదే వీధిలోని ఓ ఫ్లాట్‌లో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాధితురాలిని డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. అనంతరం ఇద్దరు కలిసి ఫ్లాట్‌లో పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు డ్రింక్‌ ఆఫర్‌ చేశాడు. ఇంతలో అతడి రూమ్‌మేట్స్‌ అక్కడికి చేరుకున్నారు. బాధితురాలు సున్నితంగా డ్రింక్‌ తిరస్కరించినప్పటికీ ఫ్రెండ్స్‌ ముందు పరువు పోతుందంటూ ఆమెతో తాగించాడు. అనంతరం అదే రాత్రి తన రూమ్‌మేట్స్‌తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బుధవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్‌ 376డీ కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. స్వప్నిల్‌ నేరం అంగీకరించాడని, అయితే తన స్నేహితులకు మాత్రం ఈ ఘటనతో సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు