మహిళా రోగిపై మూడేళ్లుగా డాక్టర్‌ పైశాచికం..

14 Oct, 2019 12:34 IST|Sakshi

ముంబై : చికిత్స కోసం తన వద్దకు వచ్చిన 27 ఏళ్ల మహిళపై లైంగిక దాడి చేయడంతో పాటు బ్లాక్‌మెయిల్‌ చేసి లోబరుచుకున్న డాక్టర్‌ (58)ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..2015లో అనారోగ్యంతో బాధపడుతూ బాధితురాలు వైద్యుడు వంశ్‌రాజ్‌ ద్వివేదిని సంప్రదించగా ఆమెకు మత్తుమందు ఇచ్చి అభ్యంతరకర వీడియోను తీశాడు. ఈ వీడియోను చూపి ఆమెను లోబరుచుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా గత ఏడాది వరకూ డాక్టర్‌ బాధితురాలపై లైంగిక దాడి కొనసాగించాడు. డాక్టర్‌ వేధింపులను భరించలేని బాధితురాలు ఆయన ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో వీడియోను వైరల్‌ చేశాడు. ఈ వీడియో మహిళ భర్త కంటపడటంతో మొత్తం విషయం తెలుసుకున్న భర్త డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. డాక్టర్‌ను అరెస్ట​ చేసిన పోలీసులు ఆయనను కోర్టు ఎదుట హాజరుపరచగా ఈనెల 17 వరకూ పోలీస్‌ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు