పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. 

20 Sep, 2018 16:40 IST|Sakshi

ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ మోడల్‌, బుల్లితెర నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ టీవీ నటి, నిందితుడు ముంబైలోని ఓ కాలేజీలో పరిచయమయ్యారు. అనంతరం సోషల్‌ మీడియా, ఫోన్‌లో సంభాషించుకుని మరింత దగ్గరయ్యారు. న్యూఢిల్లీలో ఉండే అతని తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పి ఆ నటిని తన వెంట తీసుకెళ్లాడు. 

తిరుగుప్రయాణంలో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి నిందితుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం పెళ్లి గురించి అడిగితే.. మొహం చాటేయడంతో.. మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు