అప్పు ఇవ్వలేదని హత్యాయత్నం

3 Apr, 2018 11:26 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌

పరిస్థితి విషమం

నెల్లూరు(క్రైమ్‌): అప్పు అడిగితే ఇవ్వలేద న్న అక్కసుతో ఓ వ్యక్తిపై సన్నిహితుడే కత్తితో విచక్షణా రహితంగా హత్యాయత్నం కు పాల్పడ్డాడు. ఈ ఘటన కొరడావీధిలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కుక్కలగుంటకు చెందిన సయ్యద్‌ రియాజ్‌ కొరడావీధిలో ఫ్రెండ్స్‌ సర్వీస్‌ పాయింట్‌ పేరిట ఈ– కార్యాలయం (ఆధార్‌కార్డులు డౌన్‌లోడ్, ఈ రీఛార్జ్, జెరాక్స్‌ తదితర సేవలు) నిర్వహిస్తున్నారు. ఆయన దుకాణానికి ఎదురుగా ఖాదర్‌బాషా బంగారు దుకాణం ఉంది. అందులో గుమస్తాగా పని చేస్తున్న షేక్‌ షామిల్‌ తరచూ రియాజ్‌ షాపులోనే ఉండేవాడు. ఇద్దరు సన్నిహితంగా ఉండేవారు. రియాజ్‌ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా సహా యం చేసేవాడు. మూడు రోజులుగా షామిల్‌ అప్పు కావాలని రియాజ్‌ను అడుగుతూ వస్తున్నాడు. రియాజ్‌ తాను ఇవ్వలేని చెప్పడంతో అతని మీద కోపం పెంచుకున్నాడు. సోమవారం రియా జ్‌ షాపులో ఉండగా షామిల్‌ వచ్చి డబ్బులు అడిగాడు.

రియాజ్‌ లేవని చెప్పడంతో నీ అంతు చూస్తానని బెదిరించి దుకాణంలో నుంచి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటికి షామిల్‌ తిరిగి రియాజ్‌వద్దకు వచ్చి ఇప్పు డు నిన్ను చంపుతా ఎవరు అడ్డొస్తారంటూ కత్తితో గొంతుపై పొడిచాడు. కుడి చేయి నరాలు కోశాడు. వీపుపై బలంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రియాజ్‌ షాపులో నుంచి బయటకు వచ్చి  కుప్ప కూలిపోయాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మూడో నగర పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందడంతో ఎస్సై ఎస్‌. వెంకటేశ్వరరాజు  ఘటనా స్థలానికి చేరుకుని హత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు షామిల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రియాజ్‌పై దాడి చేసి పరారవుతున్న షామిల్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. వారి నుంచి అతను తప్పించుకుని పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు