హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

28 Apr, 2018 07:38 IST|Sakshi
మృతురాలు బర్మావత్‌ లక్ష్మి, నిందితుడు అశోక్‌

కోదాడ : హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోదాడ పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన బర్మావత్‌ లక్ష్మి  ఏప్రిల్‌ 5న దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. అదే గ్రామానికి చెందిన అజ్మీరా అశోక్‌నే చెడు అలవాలట్లకు బానిసగా మారి చోరీలకు పాల్పడుతున్నాడు. బాలాజీనగర్‌కు చెందిన సీతరాంసింగ్‌  కుటుంబ సభ్యులు ఈ నెల మొదటివారంలో ఊరికి వెళ్లారని తెలుసుకుని దొంగతనానికి వచ్చాడు. కాని ఇంటి యజమానురాలు లక్ష్మి ఇంట్లోనే ఉండడంతో తన పేరు బయట పెడుతుందని అక్కడ ఉన్న బ్లేడుతో గొంతు కోశాడు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు బిరువా తాళం తీసి చిందరవందర చేశాడు. కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించి ఇంటిలో రక్తపు మరకలను హత్య జరిగిన మరుసటి రోజే కుటుంబ సభ్యులు ఇతనిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణలో అశోక్‌ నిందితుడిగా తేలడంతో అరెస్ట్‌ చేసినట్టు సీఐ వివరించారు. 
రహస్యం ఎందుకో..?
హత్య జరిగిన రోజు ఇంటి వద్ద తచ్చాడడమే కాకుండా కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంట్లో రక్తపుమరకలను కడగడంతో అతనిపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చెయ్యడంతో పోలీసులు ఏప్రిల్‌ 6న అజ్మీరా అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు నాటి నుంచి విచారణ చేస్తునే ఉన్నారు. కేసును ఛేదించడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, కొంత మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెపుతూ వచ్చారు.  ఈ క్రమంలో గురువారం రాత్రి 9–30 గంటలకు వాట్సప్‌లో హత్య కేసు నిందితుడు అజ్మీరా అశోక్‌ అని,   సీతారాంసింగ్‌ ఇంటిలో  దొంగతనానికి వచ్చి, అడ్డు వచ్చిన లక్ష్మిని దారుణంగా హత్య చేశాడని, అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కోదాడ పట్టణ సీఐ పేరుతో  ఓ పోస్టు పెట్టారు. దీన్ని కొంత మంది గమనించగా  మరికొంత మంది చూడలేదు. సంచలనం కలిగించిన ఈ హత్య కేసులో నిందితుడిని అంత రహస్యంగా రిమాండ్‌ చేయాల్సిన అవసరం ఏమోచ్చిందన్న ప్రశ్న పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.  చిన్న చిన్న దొంగలను పట్టు కున్నప్పుడు  సమావేశాలు పెట్టి, ఫొటోలు తీసి వెల్లడించే పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకు ఇలా చేశారనేది అంతుచిక్కిని  ప్రశ్న. దీనికి పోలీసులు మాత్రం సమయం లేక పోవడం వల్ల అలా చేశామని, దీనిలో ఇతరత్ర కారణాలు ఏమీ లేవని అంటుండడం కొసమెరుపు.

ఆద్యంతం హైడ్రామానే..
అశోక్‌ అరెస్ట్‌ ఆద్యంతం హైడ్రామాగానే సాగింది. పోలీసులు నిందితుడిని హత్య జరిగిన రోజునే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొదట నిందితుడు నేరాన్ని ఒప్పుకోకపోవడంతో పోలీసులు 15 రోజులుగా వివిధ కోణాల్లో విచారణ చేసి చివరకు అతడే నిందితుడిగా తేల్చారు. అజ్మీరా అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అతడే నిందితుడని పలువురు భావిస్తున్న విషయానిన ‘సాక్షి’ ఈ నెల 7న ‘పోలీసుల అదుపులో నిందితుడు’ శీర్షికన కధనం ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. 

మరిన్ని వార్తలు