మేకల కాపరి దారుణ హత్య

21 May, 2019 09:20 IST|Sakshi
యాదయ్య మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీసీపీ, (ఇన్‌సెట్‌లో ఫైల్‌)

రాత్రి మేకల మంద వద్దకు వెళ్తుండగా ఘటన  

మారణాయుధాలతో కిరాతకంగా దాడి  

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

తులేకలాన్‌లో విషాద ఛాయలు

పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

ఇబ్రహీంపట్నంరూరల్‌: జీవాల కాపరి దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి మేకల మంద వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దారి కాసిన దుండగులు మారణాయుధాలతో నరికి చంపారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం సీఐ గురువారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం... ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్‌ గ్రామానికి చెందిన కోరివి యాదయ్య గ్రామంలో మేకలను కాస్తూ జీవనం సాగిస్తంటాడు.  గ్రామంలోని ఎర్రగుంట చెర్వు వద్ద పాక ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు రాత్రి మంద వద్దే కాపాలాగా నిద్రిస్తుంటాడు.  ఆదివారం కోరివి బుగ్గయ్య కుమారుడి వివాహానికి యాదయ్య కుటుంబ సభ్యులందరూ వెళ్లి వచ్చారు. రాత్రి 9:30 గంటల సమయంలో యాదయ్య టీవీఎస్‌ ఎక్సెల్‌పై ఇంటి నుంచి మేకల మంద వద్దకు బయల్దేరాడు.

తులేకలాన్‌ ప్రధాన రహదారి దాటి ఎర్రగుంట చెర్వు వద్దకు వెళ్లేదారిలో మాటుకాసిన దుండగలు మారణాయుధాలతో యాదయ్యపై దాడి చేశారు. ద్విచక్ర వాహనం వదిలి దుండగల నుంచి తప్పించుకునే క్రమంలో యాదయ్య పడిపోవడంతో దుండగులు అతికిరాతకంగా కత్తులతో దాడి చేశారు. యాదయ్య ఫోన్‌ అదే గ్రామానికి చెందిన పాల వ్యాపారి అచ్చన శ్రీశైలంకు తెల్లవారుజామున దొరికింది. తెల్లవారినా యాదయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. ఫోన్‌ రిసీవ్‌ చేసిన శ్రీశైలం యాదయ్య జాడ తెలియదని చెప్పడంతో కుటుంబీకులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోన్‌ దొరికిన ప్రదేశం నుంచి పది మీటర్ల దూరంలో రక్తపుమడుగులో యాదయ్య మృతదేహం కనిపించింది. మృతుడి ఒంటిపై, రెండు చేతులు, తలపై కత్తిపోట్లు గుర్తించారు. మృతుడు యాదయ్యకు భార్య ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

ఘటనా స్థలం పరిశీలన..
హత్య జరిగిన విషయం తెలుసుకున్న ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ గురవారెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు.  తులేకలాన్‌ గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నెక్లెస్‌ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..!

సోదరికి అన్యాయం చేశాడని..

మద్యం సేవించి సెల్ఫీలు దిగి ఆపై ప్రేమజంట..

బాలిక మిస్సింగ్‌.. ఆందోళనలో తల్లి

కూలిన ఏఎన్‌- 32.. 13 మృతదేహాలు వెలికితీత

ఐటీ ఉద్యోగిని దారుణ హత్య

దాసరి కుమారుడు అదృశ్యం

ముసుగు దొంగల హల్‌చల్‌ 

కుటుంబ కలహాలతో ఆత్మహత్య

రూ.100 కోట్ల స్కాం : లిక్కర్‌ బారెన్‌ కుమారుడు అరెస్ట్‌

జాతరకు వెళుతూ మృత్యుఒడికి

వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె

నౌహీరా కేసులో.. పోలీసుల దూకుడు

దారుణం: నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి..

కూతురి ఎదుటే ప్రాణం తీసిన భర్త

టిక్‌టాక్‌ చేస్తూ విషం తాగేసింది...

కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం

రైస్‌ పుల్లింగ్‌ మిషన్‌ పేరిట ఘరానా మోసం

ఇంట్లో మనుషులు ఉండగానే భారీ చోరీ

బుకీ ఫారెన్‌లో... పంటర్లు సిటీలో!

జైలుకెళ్లొచ్చినా మారని కి'లేడీ'

యర్రంశెట్టి రమణగౌతం రిమాండ్‌

రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నాయకుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం 

వివాహమైన 34 రోజులకే..

కదులుతున్న కారు నుంచి భార్యను తోసి..

‘కే ట్యాక్స్‌’పై ఐదు కేసులు

కారు టైర్‌ పేలి కానిస్టేబుల్‌ మృతి

‘పది’ జవాబు పత్రాలు గల్లంతు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం

చెన్నైకి వణక్కం

ఫ్యాన్‌ మూమెంట్‌

కంటిని నమ్మొద్దు