రూ. 500 కోసమే హత్య

24 Sep, 2019 13:22 IST|Sakshi

మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ

నిందితుడి అరెస్ట్, రిమాండ్‌

సైదాబాద్‌: ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడిని సైదాబాద్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నగర పోలీస్‌కమిషనర్‌ అంజనీకుమార్‌ సైదాబాద్‌ పోలీసులతో కలిసి  సోమవారం వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం, పుల్యానాయక్‌ తండాకు చెందిన రమావత్‌ సక్రునాయక్‌ నగరానికి వచ్చి అడ్డాకూలీగా పని చేసేవాడు. తరచూ నగరానికి వచ్చే అత ను ఫుట్‌పాత్‌లపై నిద్రించేవాడు. ఈ క్రమం లో చంపాపేటలోని ఓ వైన్‌షాప్‌ వద్ద సేవిస్తుండగా అదే మండలం ఉమ్మంతలపల్లి గ్రామానికి చెందిన మదిగొండ అంజమ్మ (50)తో పరిచయం ఏర్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త  చంద్రయ్యకు దూరంగా ఉం టున్న అంజమ్మ చింతల్‌బస్తీలోని అక్క కూతు రు ముత్యాలు ఇంట్లో ఉండేది.

ఈనెల 11న చింతల్‌బస్తీ సమీపంలోని వైన్స్‌ షాప్‌ వద్ద మద్యం కొనుగోలు చేసిన ఇద్దరు మద్యం తాగేందుకు టెలిఫోన్‌ కాలనీలోని ఖాళీ స్థలంలోకి వచ్చారు. అనంతరం అంజమ్మపై సక్రు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 500 ఇవ్వాలని అంజమ్మ డిమాండ్‌ చేయగా మద్యానికే రూ. 400 ఖర్చయ్యాయని తన వద్ద డబ్బులు లేవని సక్రు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన సక్రునాయక్‌ అంజమ్మ తలపై బండరాయితో మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సక్రుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకోని విచారించగా నేరం అంగీకరించడంతో  సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. ఈ కేసును చేధించిన సైదాబాద్‌ పోలీసులతో పాటు ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను సీపీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిజం రాబట్టేందుకు పూజలు

సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు

అత్తింటి ఆరళ్లకు యువతి బలి

అమ్మ ఎక్కడుంది నాన్నా?! 

ఆడపిల్ల పుట్టిందని కుమార్తెను చంపేశారు..

శీలానికి వెల కట్టారు..

అక్రమార్జనలో ‘సీనియర్‌’ 

కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

ఆగని తుపాకుల మోత! 

కనిపించని కనుపాపలు!

కుందూలో మూడో మృతదేహం లభ్యం 

రక్షించేందుకు వెళ్లి..

ప్రియురాలితో కలిసుండగా పట్టుకుని చితకబాదారు..!

రైల్వే ప్రయాణికుడి వేషంలో చోరీలు

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ఉద్యోగం పేరుతో ఘరానా మోసం

బాలిక అపహరణ.. సామూహిక లైంగిక దాడి

రైల్వే టికెట్‌ కౌంటర్‌లో చోరీ

బాలిక అపహరణ..సామూహిక లైంగిక దాడి

దూకుతా.. దూకుతా..

ఎస్‌ఐ పైకే కారు ఎక్కించబోయారు   

అడ్డొచ్చిన ఎస్సై మీదకు కారు తోలడంతో..

పాలకొల్లులో మహిళ ఆత్మహత్యాయత్నం

ఆశారాం బాపూకు చుక్కెదురు

పశ్చిమగోదావరిలో విదేశీయుడి అరెస్ట్‌ 

విషం కలిపిన కాఫీ పిల్లలకు ఇచ్చి.. తల్లీ అఘాయిత్యం

అశ్లీల చిత్రాలతో బెదిరింపులు

చిక్కిన పాకిస్థానీ.. అప్పగించాల్సిందే..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

వాల్మీకి.. టైటిల్‌లో ఏముంది?

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

నవ్వించి ఏడిపిస్తాం