పక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు

12 Nov, 2019 04:42 IST|Sakshi
నిందితుడిని పట్టుకున్న పోలీసులు

మృతదేహాన్ని విరిచేసి ప్లాస్టిక్‌ సంచిలో కుక్కిన నిందితుడు 

అదుపులోకి తీసుకున్న పోలీసులు 

సాక్షి, అమరావతి బ్యూరో/భవానీపురం(విజయవాడ పశ్చిమ) : బెజవాడలో ఆదివారం అదృశ్యమైన బాలిక పక్కింట్లోనే శవమై కనిపించింది. విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి పరిధిలోని నల్లగుంటలో ఈ దారుణం జరిగింది. ఏసుపాదం, రమణ దంపతుల కుమార్తె మొవ్వ ద్వారక(8)  ఆదివారం  అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు అదే రోజు రాత్రి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాలిక ఇంటి పక్కనే ఉండే మర్లపూడి ప్రకాష్‌ భార్య సోమవారం ఊరి నుంచి వచ్చి ఇంటి తలుపులు తెరచి చూడగా ఒక మూటలో బాలిక శవం కనిపించింది.

ఈ విషయాన్ని ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు తెలిపింది. ఆగ్రహంతో స్థానికులు ప్రకాష్‌ను చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. బాలిక తండ్రి ఓ లిక్కర్‌ షాపులో పనిచేస్తుండగా, తల్లి రమణ ఓ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుంది. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.  బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడబోగా కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.  

నిందితులను వదిలేది లేదు : వాసిరెడ్డి పద్మ 
బాలికలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులను వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ చెప్పారు.  బాలిక ద్వారక కుటుంబీకులను ఆమె సోమవారం పరామర్శించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆడపిల్లలు పుట్టారని అమానుషం

వరుడి సూసైడ్‌ : వారిపైనే అనుమానం

వర్షిత హంతకుడి సీసీ ఫుటేజీ చిత్రాలు విడుదల

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి

కారు బోల్తా, ఇంజనీరింగ్‌ విద్యార్థులు మృతి

బెజవాడ: అల్లరి మూకల చిల్లర చేష్టలు!

విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది!

భీమవరంలో ఎం.ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

గోనె సంచిలో చిన్నారి ద్వారక మృతదేహం

మహిళను ముంచిన ‘మందు’

చార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ పేలి యువకుడి మృతి

సీసీటీవీ అనుకుని దాన్ని ఎత్తుకెళ్లిపోయారు..

టిక్‌టాక్‌ వీడియో వైరల్‌తో మనస్తాపం..

రోడ్డుపై నుంచి.. వంతెనలో..

సైడ్‌ ఇవ్వలేదని..

మోడల్‌తో ప్రేమాయణం..తరచు విదేశీయానం

హోటల్‌లో యువతిపై అఘాయిత్యం

రెప్పపాటులో ఘోరం

ఓఎల్‌ఎక్స్‌ పేరుతో ఆగని మోసాలు

పెళ్లికొడుకు మృతి కేసులో ట్విస్ట్‌

ఆడుకుంటూనే.. పోయింది!

ప్రాణం తీసిన సెల్ఫీ మోజు

ఠాణాలో తాగి..సెల్ఫీ దిగిన నేతలు

అల్వాల్‌లో అమానుషం

మృతదేహాన్ని ఒకరోజు దాచి.. చెరువులో వేశారు

మంత్రగత్తె ముద్ర వేసి చెప్పుల దండతో ఊరేగింపు..

‘రెప్పపాటు’ ఘోరం.. నిద్రమత్తులో రైలు దిగుతూ..

తిన్నది కక్కిస్తారా.. గతంలోలాగా వదిలేస్తారా? 

ప్రైవేట్‌ కండక్టర్‌పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆశ పెట్టుకోవడం లేదు

మామ వర్సెస్‌ అల్లుడు

బుజ్జి బుజ్జి మాటలు

గోవాలో...

తెల్ల కాగితంలా వెళ్లాలి

విజయ్‌ సేతుపతితో స్టార్‌డమ్‌ వస్తుంది