పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు 

24 Jul, 2019 11:09 IST|Sakshi
రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై రవీందర్‌

సాక్షి, లింగాలఘణపురం(వరంగల్‌) : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నాగారంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజశేఖర్‌రెడ్డి(30) సోమవారం తన సోదరుడైన దుంబాల భాస్కర్‌రెడ్డి వ్యవసాయ బావి వద్ద నాటు వేస్తుండగా అక్కడికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి అనంతరం రాత్రి చీకటి పడే సమయంలో తన స్వంత వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చూసుకొని ఇంటికి చేరుకున్నాడు.

తల్లిని భోజనం పెట్టాలని కోరగా ఇంకా వంట చేస్తున్నానని తాను సమాధానం చెప్పింది. ఈలోగా రాజశేఖర్‌రెడ్డి ఇంటి వెనుకాల నుంచే బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం అటు వైపుగా వెళ్తున్న గ్రామస్తులు రోడ్డుపై పడిపోయి ఉన్న రాజశేఖర్‌రెడ్డిని చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో గ్రామస్తులు ఎస్సై రవీందర్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై మృతదేహాన్ని పరిశీలించి ముక్కులోంచి రక్తం, నోటినుంచి నురగలు వచ్చినట్లుగా గుర్తించారు.

పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడా.. లేదా ఏదైనా విష పురుగు కరిచి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రవీందర్‌ తెలిపారు. 

గ్రామంలో విషాదం
గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే యువకుడు రాజశేఖర్‌రెడ్డి మృతి చెందడంతో  గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. రాజశేఖర్‌రెడ్డి తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కొడుకు చనిపోయాడనే ధ్యాస కూడ లేకపోవడం, తండ్రి ఇంటి వద్ద ఉండకుండా హైదరాబాద్, జనగామల్లో హోటల్‌లో పని చేస్తుండడంతో కొడుకు చనిపోయిన విషయాన్ని  తెలియజేసేందుకు అతడి కోసం వెతికారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబ పరిస్థితి ఇలా ఉండడంతో గ్రామస్తులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

అప్పు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని..

ఒకే బైక్‌పై ఐదుగురు.. ముగ్గురి మృతి

ప్రియుడే హంతకుడు.. !

అవినీతి జబ్బు!

బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

కట్టుకున్నవాడే కడతేర్చాడు

కోల్‌కతాలో సైనికుడి మృతి

మొదట ఇంటి దొంగల వేట.. ఎస్పీ అభిషేక్‌ మహంతి

కన్నా.. ఎక్కడున్నావ్‌?

కార్‌ డోర్లు లాక్‌.. ఇద్దరు పిల్లల మృత్యువాత

మాజీ మహిళా మేయర్‌ దారుణ హత్య..!

నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టు

భర్త హత్యకు సుపారీ.. సొమ్ము కోసం ఇల్లు అమ్మకం

మిర్యాలగూడలో విషాదం..!

చనిపోయి.. తిరిగొచ్చిందా?

కు.ని చికిత్స చేసుకున్న మహిళ మృతి

పోలీసులే మహిళతో..

బొల్లినేని గాంధీపై ఈడీ కేసు

ఘోర రోడ్డు ప్రమాదం

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..

కుటుంబంతో సహా బీజేపీ నాయకుడి దారుణ హత్య

కేపీహెచ్‌బీలో బ్యూటీషియన్‌ ఆత్మహత్య

సినిమాను తలదన్నే.. లవ్‌ క్రైం స్టోరీ..!

భర్త హత్యకు భార్య స్కెచ్‌, 10 లక్షల సుపారీ

దారుణం: కుక్కల బారి నుంచి తప్పించుకోబోయి

బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ....

ఆడి కారు కోసం... ఇంట్లోనే డబ్బులు ప్రింట్‌ చేసి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌