స్వలింగ సంపర్కానికి ఒప్పుకోలేదని..

27 Oct, 2018 03:30 IST|Sakshi

వీడిన ఆశ్రమ పాఠశాల విద్యార్థి హత్య కేసు మిస్టరీ 

నిందితుడు పదో తరగతి విద్యార్థి 

గతంలోనూ మూగ బాలుడిని హత్య చేసిన నిందితుడు 

ఖమ్మం క్రైం: ఖమ్మం నెహ్రూనగర్‌లో గల గిరిజన సంక్షేమ పాఠశాలలో పాశవికంగా హత్యకు గురైన విద్యార్థి జోసఫ్‌(10) హత్య కేసు మిస్టరీ వీడింది. అదేరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్న పదో తరగతి విద్యార్థే ఈ బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన తలారి వెంకటేశ్వర్లు, వినోదల కుమారుడు ఖమ్మంలో పదో తరగతి చదువుతూ.. గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఉంటున్నాడు. ఇతడికి స్వలింగ సంపర్కం అలవాటైంది.

ఈ క్రమంలో ఈనెల 23న జోసఫ్‌ను సైకిల్‌పై తిప్పి.. వసృతి గృహానికి తీసుకొచ్చాడు. ఎవరూ లేనిది చూసి జోసఫ్‌పై స్వలింగ సంపర్కానికి ఉపక్రమించగా.. అతడు ఒప్పుకోలేదు. దీంతో జోసఫ్‌పై దుప్పటి కప్పి రాళ్లతో కొట్టి చంపాడు. అలాగే దాదాపు రెండేళ్ల క్రితం పాల్వంచలో ఓ మూగ బాలుడైన సంతోష్‌ను ఆడుకుందామని తీసుకెళ్లి ఇదే తరహాలో స్వలింగ సంపర్కానికి ప్రేరేపించగా.. అతడు ఒప్పుకోకపోవడంతో దారుణంగా హత్య చేసి.. రెండు రోజులపాటు మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దాచి ఉంచాడు.

మరిన్ని వార్తలు